Posted on 2025-12-08 18:21:39
శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు 1384 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు
పోలీస్ కమిషనర్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గలవు. ఇట్టి సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాలలో 1084 గ్రామపంచాయతీలు 1642 వార్డులలో 268 పోలింగ్ కేంద్రాలలో 2,61,210 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో
మూడు చెక్ పోస్ట్ లను ( సాలూర , కండ్ గావ్, పోతంగల్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజ్ చేయడం జరిగిందని, వాటి విలువ దాదాపు 2,56,985/- గలవని తెలిపారు.
బోధన్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 183 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై మూడు కేసుల నమోదు చేయడం జరిగిందని, ఎడపల్లి , బోధన్ రూరల్ , కోటగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా ఆరుగురు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మిగతా నాలుగు గన్ లైసెన్సులు బ్యాంకులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1384 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >