Posted on 2025-12-08 14:07:07
డైలీ భారత్ న్యూస్,వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని జిల్లా వేర్ హౌజ్ గోదాములలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ( ఈవీఎంల)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి సోమవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని జిల్లాకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి నుండి శ్యామ్, ఏ ఐ ఎం ఐ ఎం నుండి ఫైజోద్దీన్, బిజెపి నుండి హరిశంకర్, వైఎస్సార్ సిపి నుండి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >