Posted on 2025-12-07 19:45:50
ఇక సండే అయితే ఎవరు చెప్పినా ఎంత ఫైన్ వేసిన తగ్గేదేలే అంటున్న మద్యం ప్రియులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొన్ని రోజులుగా జిల్లాలో మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు మొదటిసారిగా పట్టుబడిన వారికి జరిమానా విధించి వదిలేస్తున్నారు. ఇక రెండవసారి అదే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కోర్టుకు అప్పజెప్పి 15వేల రూపాయల జరిమానా విడించడంతోపాటు కోర్టులో జడ్జి మద్యం ప్రియులకు కోర్టు శిక్ష ప్రకారం వారికి నాలుగు రోజులు జైలు శిక్ష విధిస్తున్నప్పటికీ మందుబాబుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనపడటం లేదు. ఓవైపు సిపి సాయి చైతన్య డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీరియస్ గా వ్యవహరిస్తున్న మందు ప్రియులు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేవలం పైనే కదా కట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారో ఏంటో కానీ జరిమానాలకు, ఏ మాత్రం భయపడడం లేదు. ఇక వీకెండ్ ఆదివారం రోజు ఎలాగైనా మందు తాగాల్సిందే అనుకునే మద్యం ప్రియులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొన్నిసార్లు పట్టుబడుతున్నారు. మరికొన్నిసార్లు పోలీసులకు కన్ను కప్పి ఇతర మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. అయితే నిబంధన ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే 10000 జరిమానా కట్టాల్సిందేనని పోలీసులు చెబుతున్నప్పటికీ, రెండవసారి దొరికితే 15000 రూపాయలు, మూడవసారి దొరికితే జరిమానా తో పాటు జైలు శిక్ష సైతం కోర్టులో వారిని హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం జైలుకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివారం రైల్వే కమాన్ వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆదేశంసారం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 25 డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ఎంత మొరపెట్టుకున్నా వాహనాదారులు ఏ మాత్రం లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. మద్యం సేవించి పట్టుపడితే మొదటిసారి పదివేల రూపాయలు రెండవసారి 15వేల రూపాయలు మూడవసారి జైలు శిక్ష పరి అవకాశం ఉందని వారు అన్నారు. అయితే మందుబాబుల ఆగడాలు అరికట్టాలంటే మద్యం తాగి వాహనాలు సేవించి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినప్పుడు వారి డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తేనే వాహనదారులు ఒకింత భయం ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >