Posted on 2025-12-07 17:30:34
జిల్లా కేంద్రంలో పద్మశాలి విద్యార్థుల కొరకు వసతి గృహం కై స్థలసేకరణతో పాటు భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం
పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ లు స్పష్టం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చదువుకోవాలనే సంకల్పం ఉన్న విద్యార్థుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2025 నుండి 2028 సంవత్సరాల వరకు గాను స్వర్గీయ డాక్టర్ వనం దేవదాస్ ఆశీస్సులతో ఆదివారం నూతన పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఇందులో అధ్యక్షులుగా డీకొండ యాదగిరి ప్రధాన కార్యదర్శిగా గంట్యాల వెంకట నరసయ్య, కోశాధికారిగా కన్నరాజు ఉపాధ్యక్షులు ముగ్గురు తో పాటు ఇతర కార్యవర్గ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 70 తర్ప సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. మొదటగా ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ విద్య వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, బడ్జెట్లో ఎంత ఖర్చయినప్పటికీ కూడా విద్య కోసం వైద్య కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చిస్తుందన్నారు. అనంతరం పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ఆరు నూరైనా నూరు ఆరైనా జిల్లా కేంద్రంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ స్థలం కొరకు స్థల సేకరణ కోసం ఆ స్థలంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థను నిర్మించి తీరుతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ విద్యా వైద్యం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కులా సంఘాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, నూడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >