Posted on 2025-12-07 17:31:39
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ వివిధ దినపత్రికల కు చెందిన స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ అధ్యక్షతన ఆదివారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగింది.
ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్న కర్క రమేష్ ప్రస్తుతం వాడి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. దీంతో కమిటీని మార్పు చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు అసోసియేషన్ అధ్యక్షులుగా గుండాజీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా హైమాద్, కోశాధికారిగా కిషోర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా సదానంద్, కొక్కు రవికుమార్, గౌరవ అధ్యక్షులుగా కొట్టురు శ్రీనివాస్, సలహాదారులుగా మల్లెపూల నరసయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏడాది కాలం పాటు కొనసాగించేలా కమిటీ నిర్ణయం తీసుకుంది. అనంతరం నూతన కమిటీని అసోసియేషన్ సభ్యులు శాలువాలు, పూలదండలతో సన్మానం చేసి అభినందించారు. ఈ సమావేశంలో బ్యాగరి శ్రీనివాస్, తంగేళ్ల ప్రకాష్, రోoడ్ల శ్రీనివాస్ రెడ్డి, కొట్టూరు ప్రమోద్ లు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >