| Daily భారత్
Logo




అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

News

Posted on 2025-12-08 09:08:14

Share: Share


అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా ఉంది

రెండేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాటతప్పిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలేల పరిస్థితి ఘోరంగా తయారైందని, కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 130 కోట్ల నిధులు బీజేపీ ఎమ్మెల్యేగా తాను రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకోవచ్చానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తుందని మండిపడ్డారు. నగర మౌలిక వసతులు అభివృద్ధి నిధులకోసం ఇప్పటివరకు 650 లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అన్నారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం హేయమైన చర్య అన్నారు. 10 ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో నగరంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేక పోయారని విమర్శించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేకపోయారన్నారు. ఈ సమావేశంలో బిజెపి మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >