Posted on 2025-12-09 11:21:25
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: గత కొన్నేళ్లుగా ఎన్నికల ప్రచారంలో వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలు కీలకంగా మారాయి. ప్రస్తుత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థులు ఈ మాధ్యమాల్లోకి చొచ్చుకుపోతున్నారు. తొలి దశ పోలింగ్‌కు ఇక ఎంతో టైం లేకపోవడంతో పోస్టులు, రీల్స్‌తో సెల్‌ఫోన్లను మోతమోగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో తమ ఆలోచనల్ని, హామీలను ప్రతి ఓటరుకు వివరించే టైం ఉండదు. వాట్సప్ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో అవన్నీ సులభంగా వివరిస్తున్నారు. క్షణాల్లో వందలు, వేల మందికి వారి ఆలోచనల్ని, హామీలను చేరవేస్తున్నారు. ప్రచార రథాలపై డిజిటల్ తెరల ద్వారానూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి మెరుపు వేగంతో చొచ్చుకుపోతున్నారు.నిమిషంలోపు ఉండేలా తమ ఆడియో, వీడియో ప్రొఫైల్ రూపొందించి ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు సర్పంచి, వార్డు అభ్యర్థులు. తమ నేపథ్యం, వారు చేసిన సేవలను అందులో తెలియజేస్తున్నారు. 2 నుంచి 3 నిమిషాల నిడివితో హామీలు, మేనిఫెస్టో రీల్స్‌ను పోస్టు చేస్తున్నారు. వీటితోపాటు తమకు ఓటేయాలంటూ 30 నుంచి 40 సెకన్ల స్పీచ్‌తో ఆడియో ఫైల్స్ షేర్ చేస్తున్నారు. తనకు ఓటేస్తే గ్రామాన్ని ఎలా మారుస్తామన్నది స్వయంగా వివరిస్తున్నారు. తమ గెలుపుకి సహకరించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇళ్లు, గోడలపై పోస్టర్లు తగ్గి పోస్టుల ప్రచారం తారస్థాయికి చేరుతోంది.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >