| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

డైలీ భారత్, కామారెడ్డి : రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీలో సేవాభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొడిప్యాక సాయిరాం ను  జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ బలోపేతం చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటు, సభ్యత్వ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సంస్థకు విలువైన సేవలు అందిస్తున్నందుకు ఈ పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొడిప్యాక సాయిరాం మాట్లాడుతూ, సేవలను, అంకితభావాన్ని, నిజాయితీని, క్రమశిక్షణను గుర్తించి తనకు జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు , రాష్ట్ర అధ్యక్షురాలు  సూర స్రవంతి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే నా పై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని కల్పించిన వీరమల్ల రమశ్రీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నా పై అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి, ప్రజల హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని కొడిప్యాక సాయిరాం హామీ ఇచ్చారు.

Previous తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Next కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..
ADVERTISEMENT