| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

News

Posted on 2026-06-02 12:56:43

Share: Share


రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొత్త బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడి పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. వేములవాడ మున్సిపల్ పరిధి  శాత్రాజుపల్లెకు చెందిన అశోక్ అనే యువకుడు ఈ సాహసానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురైన అతను, తన భార్యకు విడాకులు ఇప్పించేలా ఒక వ్యక్తి వ్యవహరించాడని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగాడు. ఇప్పటికే తాను పురుగుల మందు సేవించానని, ట్యాంక్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటానని అతను కేకలు వేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అశోక్‌ను కిందికి దింపేందుకు యత్నించగా, అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తరుణంలో ఎస్బీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఎంతో చాకచక్యంగా వాటర్ ట్యాంక్ ఎక్కి, అశోక్‌ను గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మరికొందరు సిబ్బంది ట్యాంక్ పైకి చేరుకుని అతడిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం ఫైర్ ఇంజిన్ సహాయంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడటంతో స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు.

Image 1

అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమం కు ఆర్థిక సహాయం అందజేసిన పెనుమత్స సుబ్బారావు

Posted On 2026-07-25 09:56:06

Readmore >
Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >