Posted on 2026-06-02 14:59:38
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారులు హనుమంతరావు
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ సలహాదారులు (బీసీ సంక్షేమ శాఖ) హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అమర వీరులకు నివాళులర్పించారు.
అనంతరం ఐడీఓసీ (IDOC)లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారులు పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని వివరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వ సలహాదారులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మెమెంటోలు అందజేసి అభినందించారు.
అంతర్జాతీయ యోగా పోటీలలో ప్రతిభ కనబరిచిన యోగా విద్యార్థులకు రూ.50 వేల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికలను అందజేశారు. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఏడుగురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్ సందర్శించి శాఖల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, NV గిరి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమం కు ఆర్థిక సహాయం అందజేసిన పెనుమత్స సుబ్బారావు
Posted On 2026-07-25 09:56:06
Readmore >
సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన
Posted On 2026-07-25 07:31:14
Readmore >
ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు
Posted On 2026-07-25 07:06:03
Readmore >
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...
Posted On 2026-07-25 04:00:34
Readmore >
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 17:38:47
Readmore >
దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు
Posted On 2026-07-24 16:54:48
Readmore >