| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు

News

Posted on 2025-11-27 14:17:39

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు

చెక్ పోస్ట్ ల వద్ద 24/7 అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖి చేయాలి

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు తంగాలపల్లి(జిల్లెళ్ల),గంభీరావుపేట్ (పెద్దమ్మ) ముస్తాబాద్ (వెంకట్రావ్ పల్లి), వేములవాడ రూరల్ (ఫజుల్నగర్), బోయిన్పల్లి (నర్సింగపూర్), రుద్రాంగి(మనాల క్రాస్ రోడ్)లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈరోజు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసి చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ మద్యం,డబ్బు రవాణా అడ్డుకట్ట వేయాలని చేయాలని ఆదేశించారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబందనలు పాటించాలని,తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేయాలని,అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు,వ్యాపారం,పెళ్లిళ్లు,ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు.నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని,ఎన్నికల నియమావలిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు  ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఎస్పీ వెంట వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >