| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఇంటి పై  ఏసిబీ అధికారుల దాడులు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెడుతూ ప్రజల నుండి అక్రమంగా అవినీతి సొమ్మును కాజేస్తున్న అవినీతి అధికారులపై ఎస్ సి బి అధికారులు కొరడా ఝాలిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రభుత్వ కార్యాలయాల లో ఏసీబీ అధికారుల దాడులు వార్తలు గత కొద్దిరోజులుగా వింటూనే ఉన్నప్పటికీ లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు కనబడడం లేదు. ఎక్కడ ఏ చిన్న చాన్సు దొరికితే ఏమాత్రం తలోగ్గాకుండా అక్రమ అవినీతి సొమ్ము కోసం ఆరటు పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంకా సదరు మున్సిపల్ కమిషనర్ ఇంట్లోనే ఏసీబీ అధికారులు ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.


#acb #armur #Nizamabad 

Previous స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలోనిజామాబాద్ ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ 56వ వార్షికోత్సవ వేడుకలు
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు
ADVERTISEMENT