డైలీ భారత్ డెస్క్ : మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆటో మీటర్ చార్జీలు వెంటనే పెంచాలని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్ ఉమర్, నిత్యానందం డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్ తీర్పు ఆటో డ్రైవర్లకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో బుధవారం తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడుతూ 11ఏళ్లలో బస్ చార్జీలు 6సార్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేత్తనాలు 3సార్లు పేరిగాయని ఎమ్మెల్యేల జీతాలు ఒకేసారి మూడు వందల శాతం పెంచుకోవడం జరిగిందని తెలిపారు. కానీ ఆటో మీటర్ చార్జీలు ఈ 11ఏళ్లలో ఒక్క సారి కూడా పెరగలేదని పేర్కొన్నారు. వివిధ రూపాల్లో అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లిన పెంచలేదని అన్నారు. ఇటీవల మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేయగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని తీర్పునిచ్చింది వెల్లడించారు. ఐతే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆదేశాలను అమలు చేయాలని జనవరి లో ప్రభుత్వంపై వత్తిడి తెద్దామని ఆటో డ్రైవర్లకు పిలుపు నిచ్చారు. అమలు చేసే అవకాశం ఉంటుందని, అనవసరంగా కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘాలు వాళ్లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకు తీసుకు వస్తారు. ధర్నాలు చేయిస్తారు, లాఠీ చార్జి చేయిస్తారు అనవసరంగా ఆటో డ్రైవర్లు నష్టపోతారని వెల్లడించారు. కాబట్టి వారి మాటలు విని మోస పోవద్దని ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ ఉమర్, ప్రధాన కార్యదర్శి నిత్యానందం శివానంద్, సిటీ అద్యక్షుడు వినోద్, ప్రధాన కార్యదర్శి కిరణ్, నాయకులు హరిబాబు, అబ్దుల్ రవుఫ్, ఖదీర్ కులేడీ తదితరులు పాల్గొన్నారు.
News
ఆటో ఛార్జీలు వెంటనే పెంచాలి తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్