Posted on 2025-11-27 09:26:51
చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం..సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ఇస్తుందా
నిజామాబాద్ ఎంపీ అరవింద్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రప్రభుత్వంపై విమర్శించారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సదువుకునేటోళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు సర్పంచ్ పదవుల కోసం రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు.
ఇక జిల్లాలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం 13.5 కోట్లు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
విడుదల అయిన నిధులతో రాష్ట్ర సర్కార్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా యుద్ద ప్రాతిపదికన ఆర్ఓబి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అలాగే అర్సపల్లి ఆర్వోబి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ తొందరగా చేయించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఆర్వోబీ పెండింగ్ ఉందని, దీనిపై ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం 17 శాతమే రిజిస్ట్రేషన్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దొంగనాటకం బయటపడిందని దుయ్యబట్టారు. కేవలం కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, మరి ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ ను ప్రజలు
చీత్కరిస్తరని ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఈ సర్పంచ్ ఎన్నికల ఓట్ల కోసమే మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని విమర్శించారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >