| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నగరంలో అర్ధరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అగ్నిప్రమాదం కలకలం

నగరంలో అర్ధరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అగ్నిప్రమాదం కలకలం

పూర్తిగా దగ్ధమైన కంప్యూటర్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు

ఫైర్ సేఫ్టీ సదుపాయం బ్యాంకులో లేకపోవడం వల్లే ఇంత భారీ నష్టం జరిగిందా..?

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాంకు మేనేజర్ రంజిత్ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉందని వెల్లడించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ ఎస్‌హెచ్‌ఓ హరిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ బ్యాంకులో సైడ్ సేఫ్టీకి గల సంబంధించిన సదుపాయాలు బ్యాంకు నిర్వాహకులు అమర్చారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించి కంప్యూటర్లు, విలువైన డాక్యుమెంట్లు పూర్తిగా దగ్ధం కావడం పట్ల ప్రజల్లో బ్యాంకులంటేనే నమ్మకం కలిగేలా ఉన్న ప్రజలకు ఇలాంటి అగ్నిప్రమాదం వల్ల బ్యాంకులంటే ఏ మేరకు సురక్షితం అనే సందిగ్ధంప్రజల్లో నెలకొంది.


Previous గుప్త నిధుల పేరుతో మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
Next ఆటో ఛార్జీలు వెంటనే పెంచాలి తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్
ADVERTISEMENT