| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో దీక్షా దివస్ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు

News

Posted on 2025-11-25 17:26:19

Share: Share


ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో దీక్షా దివస్ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికలకు ముందు,ఆ తర్వాత ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా విఫలం చెందారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అలవికాని హామీలెన్నో ఇచ్చి, మోసపూరితంగా వ్యవహరించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. ప్రత్యేక  రాష్ట్ర సాధన కోసం "తెలంగాణ తెచ్చుడో-కేసీఆర్ సచ్చుడో","కేసీఆర్ శవయాత్రనో-తెలంగాణ జైత్రయాత్రనో"అని నినదిస్తూ మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2009 నవంబర్ 29వతేదీన చేపట్టిన "దీక్షా దివస్"ను ప్రపంచానికి మరోసారి గుర్తు చేసేందుకు గాను సన్నాహాకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లోబీఆర్ఎస్ శ్రేణులు సమావేశమయ్యారు.మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలోజరిగిన ఈ సమావేశంలో అశ్వరావుపేట  మాజీ  ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు బానోత్   హరిప్రియ హరిసింగ్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి మానే రామకృష్ణ, కొత్తగూడెం మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులు ప్రసంగించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ,ఉపాధి, రంగాలు, ప్రభుత్వమిచ్చే కాంట్రాక్ట్ పనుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టి, ఇప్పుడు చేస్తున్న మోసాన్ని,అన్యాయాలను ప్రజలకు వివరిద్దామన్నారు.పార్లమెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా అయితే జరిగిందో,బీసీ రిజర్వేషన్స్ పెంపుదల కూడా అదే మాదిరిగా సాధ్యమని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.జతంర్ మంతర్ వద్ద డ్రామా చేసి కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు మార్కెటింగ్ చేసుకున్నారే తప్ప, రిజర్వేషన్స్ పెంపుదల విషయంలో వారికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.తాను ప్రయత్నం చేసినప్పటికీ న్యాయస్థానాలు కొట్టి వేశాయని రేవంత్ రెడ్డి సానుభూతి పొందే ప్రయత్నాలు,కుతంత్రాలను బీసీ కనిపెట్టారని,ఆయన నాటకాలు ఇక సాగవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కేసీఆర్ బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి కుట్రలు,కుతంత్రాల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయిందని ఎంపీ రవిచంద్ర ఆవేదన చెందారు.కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, వేధింపులు,వారు పెట్టే కేసులకు ఏ మాత్రం భయపడకుండా మనమంతా మరింత ఐకమత్యంతో కలిసి ముందుకు నడుద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ,ఎంపీపీ, జేడ్పీటీసీ,మునిసిపాలిటీ ఎన్నికల్లో జయకేతనం ఏగరేయడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తాను గట్టిగా చాటుదామని, పార్టీ బలోపేతానికి మరింత అంకితభావంతో కృషి సల్పుదామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఈనెల 29వతేదీన నిర్వహించే "దీక్షా దివస్"కు 5 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 22 మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు పార్టీ శ్రేణులను కోరారు.ఈ సందర్భంగా "జై తెలంగాణ జైజై తెలంగాణ","జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్","వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి"అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >