డైలీ భారత్, నర్సంపేట: భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా నల్లబెల్లి మండలం వల్లే నర్సయ్యపల్లె గ్రామానికి చెందిన వల్లే రమేష్ యాదవ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్, నర్సంపేట నేత కంభంపాటి పుల్లారావు తో పాటు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.
"పార్టీ ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తా. ఓబీసీల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను" అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు.
ఆయన నియామకంతో నల్లబెల్లి, నర్సంపేట బిజెపి శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.