డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో సంచలనం రేపిన మాలావత్ మోహన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశామని సిఐ సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. భర్త వేధింపులను భరించలేక అతడిని పథకం ప్రకారం చంపినట్లు భార్యలు ఒప్పుకున్నారని తెలిపారు. వారిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు.
News
భీంగల్ లో సంచలనం సృష్టించిన భర్తను హత్య చేసిన భార్యలు అరెస్ట్