| Daily భారత్
Logo




అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త : నిందితుడు అరెస్ట్

News

Posted on 2025-11-22 16:18:43

Share: Share


అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త :  నిందితుడు అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, పిఠాపురం:అక్రమ సంబంధం వలన భార్యను హత్య చేసిన భర్తను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు.శనివారం గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డిఎస్పి మురళీకృష్ణ  వెల్లడించిన వివరాల ప్రకార పిఠాపురం వాసి కిలిమి శివశంకర్ రెడ్డి, విజయవాడ పెనమలూరు గ్రామానికి చెందిన శివపార్వతి ప్రేమ వివాహం చేసుకొని కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారు.పిఠాపురంలో కొంతకాలం, అనంతరం విజయవాడలో కాపురం ఉంటూ స్వీట్ షాప్‌లో స్వీట్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తాత్కాలికంగా ప్రాంతం మార్చుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తీవ్రం కాగా, శివపార్వతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు శంకర్ రెడ్డికి సమాచారం తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఎర్రబాలెం గ్రామానికి చేరుకున్న శంకర్ రెడ్డి, ఆమె గురించి విచారణ జరిపి అక్రమ సంబంధం నిజమని తెలుసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కోపంతో గత నాలుగు రోజుల క్రితం తెరపాలం ప్రాంతంలో శివపార్వతిని గొంతునులిమి హత్య చేసి పరారయ్యాడు..ఈ విషయం పై మృతురాలి అన్న ఫిర్యాదు ఆధారంగా రూరల్ ఎస్సై వెంకట్ దర్యాప్తు ప్రారంభించి, గ్రామీణ సీఐ పర్యవేక్షణలో నిందితుడు శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సిహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >