Posted on 2025-11-21 12:50:28
డిజిటల్ సాంకేతికతతో మానవాళికి సరికొత్త సవాళ్లు.
బెట్టింగ్ అనేది వ్యసనం, డబ్బు సంపాదించే మార్గం కాదు.
హాయ్..హలో.. అంటూ రొమాంటిక్ మోసాలు.
మీ గుర్తింపు నేరంలో వాడబడింది అంటూ బ్లాక్ మెయిల్
ఆన్లైన్లో పిల్లల ప్రమాదకరమైన ఆటలు.
రీల్స్ మోజులో ప్రమాదాల బారిన యువత.
పౌరులు అప్రమత్తంగా ఉండకపోతే ఆర్థిక నష్టం మానసిక నష్టం తప్పదు
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట.
డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:డిజిటల్ సాంకేతికత అరచేతిలో ప్రపంచాన్ని మన ముందుకు తెచ్చింది, డిజిటల్ యుగంలో మానవాళి మునిపెన్నడూ ఎరుగని సరికొత్త సవాళ్లను చూస్తుంది, కనిపించని కొత్త ఆన్లైన్ వ్యసనాలు ఆరోగ్యాన్ని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, పెట్టుబడి మోసాలు నకిలీ లింకులు నమ్మదగినట్లుగా కనిపించే గ్రూపులు ఇవన్నీ ఆర్థికంగా మానసికంగా ప్రజలను కుంగ తీస్తున్నాయి, ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుంది అంటూ అత్యాశ చూపే సైట్స్, లింక్ లు పెరుగుతున్నాయి, ఈ డిజిటల్ ప్రపంచం పెనుముప్పుని తెస్తుంది అనేది పౌరులు గమనించకపోతే తీవ్రమైన నష్టం తప్పదు అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్, డీప్ ఫేక్ వీడియోలు, రొమాన్స్ స్కాములు, పిల్లలపై ప్రభావం చూపే గేములు ఇలా ఇవన్నీ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా యువత, చిన్నారుల ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, కనిపించని నేరగాళ్లు ఇప్పుడు స్క్రీన్ల వెనక నుంచే మన జీవితాల్లోకి చొరబడి మోసాలు, నయవంచన సృష్టిస్తున్నారు అని ఎస్పీ అన్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ వల్ల చాలామంది అప్పుల్లో కూరకపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని తెలిపారు, చిన్న మొత్తం తో సరదాగా మొదలైన బెట్టింగ్ వ్యసనంగా మారుతుంది అన్నారు, బెట్టింగ్ అనేది డబ్బు సంపాదించే మార్గం కాదని పౌరులు గుర్తుంచుకోవాలని కోరారు. ఆన్లైన్లో పెట్టే ఫోటోలు వీడియోలను తీసుకొని సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి వ్యక్తిగా గౌరవాన్ని భంగం కలిగిస్తూ ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఈ డీప్ ఫేక్ వీడియోలతో మహిళలు యువత తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో హాయ్..హలో.. అంటూ స్నేహంతో మొదలై రొమాంటిక్ మోసాలకు గురి చేస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్లను రాత్రిళ్ళు ఎక్కువగా చూడడం వల్ల నిద్రలేమి ఆరోగ్యం దెబ్బ తినడం చదువులో ఏకాగ్రత లోపించడం పనిలో ఆసక్తి తగ్గడం లాంటివి సంభవిస్తున్నాయి అన్నారు. వ్యక్తిగత గుర్తింపుని నేరంలో ఉపయోగించారు అంటూ భయపెడుతూ డిజిటల్ అరెస్టు చేస్తామంటూ భయపెడుతూ డబ్బును దోచేసే మోసపూరిత కాల్స్ ప్రతిరోజు పెరుగుతున్నాయి. యాప్ లోన్లకు మైక్రో ఫైనాన్స్ లో లోన్ లకు వెళ్లకపోవడం మంచిది వీటి ద్వారా అప్పులు తీసుకుంటే వడ్డీ మీద వడ్డీ కట్టి ఆర్థికంగా కొల్లగొడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు, నకిలీ గుర్తింపు అప్డేట్ కేంద్రాల ద్వారా వ్యక్తుల బయోమెట్రిక్ డేటాను దోచుకునే సంఘటనలు పెరుగుతున్నాయి, గేమింగ్ వేదికలో బహుమతుల పేరుతో చిన్నారుల సమాచారాన్ని తస్కరిస్తున్నారు.
ఈ సమస్యలను డిజిటల్ ప్రపంచం తెచ్చిన సరికొత్త సవాళ్లు, వీటిని నివారించడానికి అధిగమించటానికి అప్రమత్తత, అవగాహన, జాగ్రత్త అనేవి నిజమైన ఆయుధాలు. టెక్నాలజీ సాంకేతికత రెండు వైపులా పదునైన ఆయుధాలు దాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితాలు ఆధారపడి ఉంటాయి అని ఎస్పి కోరారు.
పోలీసుల సూచనలు
అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌ను ఓపెన్ చేయకపోవడం ఉత్తమం, అనుమానం కలిగితే బ్లాక్ చేయాలి.
ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రమాదకర గేమ్‌ల జోలికి వెళ్లకూడదు.
తల్లిదండ్రులు, పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ ఖచ్చితమైన సమయ, పరిమితులు విధించాలి.
తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు.
ఫోటోలు, వీడియోలు పబ్లిక్ ప్లాట్‌ఫారాలలో ఉంచకుండా జాగ్రత్తపడాలి.
ఉద్యోగ ప్రయత్నాలు, పెట్టుబడులు—ధృవీకరించిన వనరుల ద్వారా మాత్రమే చేయాలి.
మీకు తెలిసిన వారు ఆన్లైన్ లో డబ్బులు అడిగినప్పుడు.. డబ్బులు పంపించే ముందు వారితో మాట్లాడి ధ్రువీకరించుకోవాలి.
అనుమానాస్పద ప్యాకేజీలను స్వీకరించకూడదు.
ఎవరైనా ఆన్లైన్లో మోసం చేస్తే, బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను, సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ 1930 సంప్రదించాలి.
పెద్ద కంజర గ్రామ ప్రజలకు ఇడ్ల స్థలాలు కేటాయించాలని ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత
Posted On 2025-11-21 21:07:39
Readmore >
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మెన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-11-21 19:30:24
Readmore >
ఫార్మలా -ఈ కార్ రేసు లో కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి
Posted On 2025-11-21 19:28:07
Readmore >
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలోనేవ్యాధిని చిన్న చిన్న శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయొచ్చు
Posted On 2025-11-21 13:41:10
Readmore >
డిజిటల్ సాంకేతికతతో ముప్పు.. పౌరులు తస్మాత్ జాగ్రత్త : కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట
Posted On 2025-11-21 12:50:28
Readmore >
ఎవరెస్ట్ అధిరోహకులు మాలవత్ పూర్ణ ను పరామర్శించిన మంత్రి సీతక్క
Posted On 2025-11-20 20:11:47
Readmore >