Posted on 2025-11-21 13:41:10
యశోద హాస్పిటల్ వైద్యులు డా. బర్గోహైన్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డా.బర్గోహైన్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ డి బి ఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని ఇది లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుందన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి లక్ష జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండడంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.డి బి ఎస్ ద్వారా దిర్గకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్ట వచ్చాన్నారు. డిబిఎస్ మెదడులో రెండు వైపులా చికిత్స చేయగలదని, ఇది రెండు అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయాకమన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్,రుక్మిణి లు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >