Posted on 2025-11-20 13:24:07
డైలీ భారత్ న్యూస్, గంభీరావుపేట:ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల గంభీరావుపేట ఆంగ్ల విభాగం నందు డాక్టర్ యెలగొండ ఆంజనేయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన బిల్ల రాజేందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెట్పల్లి ఎక్స్టెన్షన్ లెక్చర్ ఆన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫొనటిక్స్ పై విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఫొనటిక్స్ సౌండ్స్, వాటి ప్రాముఖ్యత, కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాధాన్యత, అత్యున్నత ఉద్యోగంలో కానీ ప్రపంచ నలదిక్కులా విజయాలలో రాణించాలంటే ఎంతగానో దోవదపడతాయని తదితర విషయాలపై కూలంకషంగా తగిన ఉదాహరణలతో వివరించారు
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. ఐవిజయలక్ష్మి మాట్లాడుతూ ఫోనెటిక్స్ అనేది మన నిత్యజీవితంలో మాట్లాడే విధానం, నడవడి అద్భుత అవకాశాలపై ప్రభావం ఉంటుందని కావున విద్యార్థులందరూ ఫొనటిక్స్ పై పట్టు సాధించుకోవాలని, విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
డాక్టర్ యెలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరూ డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి ఫొనటిక్స్ పై పూర్తిస్థాయిలో పట్టు సాధించుకోవాలని, తద్వారా అత్యున్నత ఉద్యోగ అన్వేషణకు మరియు ఎక్సాట్రాడినరి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకునేందుకు ఇది ఒక ఆయుధంగా, బంగారుగనిగా ఒక వరంలా మారుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, మనోహర్, జగనాథం అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >