| Daily భారత్
Logo




స్వర్గీయ నేత డిఎస్ అడుగుజాడల్లో సంఘాన్ని బలోపేతం చేస్తాం

News

Posted on 2025-11-20 11:22:01

Share: Share


స్వర్గీయ నేత డిఎస్ అడుగుజాడల్లో సంఘాన్ని బలోపేతం చేస్తాం

ఈనెల 23న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం అందించాం

మాజీ తొలి మేయర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా మున్నూరు కాపుల సంఘ బలోపేతం కోసం తమ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుపోతూ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో పనిచేస్తూ వెళ్లారని మాజీ మేయర్, మున్నూరు కాపు నూతన జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉన్న సమయంలో మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ఎంతగానో పనిచేశారని, అలాగే మున్నూరు కాపు కులస్తులను అందరిని సంఘటితం  తీసుకురావడానికి ఎనలేని  కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇకపై కూడా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధికార పార్టీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు రావడమే కాకుండా, బిజెపి పార్టీ నుండి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కూడా ఆహ్వానించబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కీలక ముఖ్య నేతల తో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ, తోపాటు కుల బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >