Posted on 2025-11-20 11:18:07
ధాన్యం వేగంగా కొనాలి.. డబ్బులు వెంటనే చెల్లించాలి.
నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలి
కాటా వేసిన బస్తాలను వెంటనే తరలించాలి.
ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి.
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
డైలీ భారత్ న్యూస్, వైరా:రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా ధాన్యం కొనుగోలు జరపాలని, కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు చెల్లించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరా వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం బృందం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన గన్నీ సంచులు సరఫరా చేయాలని, కాటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించాలని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ వల్ల రైతులకు ఖర్చు పెరుగుతుందని తెలిపారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ లో గంటకు ఐదు లీటర్ల డీజిల్ కాలుతుందని, గంటకు కేవలం 8 శాతం తేమ మాత్రమే తగ్గుతుందని, 20 బస్తాల ధాన్యానికి సుమారు 5000 రూపాయల ఖర్చు అవుతుందని, ఇది రైతులకు భారం అని అన్నారు. ప్యాడీ డ్రైయర్ మిషన్ ఖర్చును ప్రభుత్వం భరించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు రైతులకు అండగా నిలబడాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహనరావు, కొంగర సుధాకర్, కామినేని రవి, బెజవాడ వీరభద్రం, గొల్లపుడి ప్రకాశరావు, అమరనేని కృష్ణ, చిత్తోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >