| Daily భారత్
Logo




సిపిఐ(ఎం) పోరాటంతో కదిలిన వైద్యశాఖ

News

Posted on 2025-11-20 11:16:13

Share: Share


సిపిఐ(ఎం) పోరాటంతో కదిలిన వైద్యశాఖ

సిపిఐ(ఎం) పోరాట ఫలితం

వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్‌కు 16 లక్షలు విడుదల

డైలీ భారత్ న్యూస్, వైరా:సిపిఐ(ఎం) పోరాటానికి కొంత ఫలితం దక్కింది. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన పోరాటం వైద్యశాఖలో కదలిక తెచ్చింది. వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్‌కు రూ" 16 లక్షల మెడికల్ బడ్జెట్ విడుదల చేశారు. వైరా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే డిమాండ్‌తో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహించిన ప్రజా పోరాటాల ఫలితంగా వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ కు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా రూ.16 లక్షల మెడికల్ బడ్జెట్ విడుదలైంది. హాస్పిటల్‌లో మందులు, అత్యవసర వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన ఆరోగ్య సేవల మెరుగుదలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని, ఇక నుంచి రెగ్యులర్ గా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగుతాయని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు సంయుక్తంగా  వెల్లడించారు. వైరా ప్రజల ప్రాథమిక హక్కైన వైద్యసేవలు బలోపేతం అయ్యే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని వారు పేర్కొన్నారు.  అధికారులు, ప్రభుత్వం మరిన్ని విభాగాలు కూడా స్పందించి, వైరా ఆస్పత్రి ద్వారా  పుర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >