| Daily భారత్
Logo




సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినిహాయింపు ఇవ్వాలి

News

Posted on 2025-11-20 13:38:14

Share: Share


సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినిహాయింపు ఇవ్వాలి

కేజీబీవీ లో care taker ను నియమించాలి, MTS ఇవ్వాలి.

TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి డిమాండ్

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:విద్యారంగ సమస్యలు,ఉపాధ్యాయుల సమస్యల సేకరణలో భాగంగా టిపిటిఎఫ్ తంగళ్ళపల్లి  మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించి సభ్యత్వం సేకరించారు. బీఈడీ.టిటిసి చేసిన తర్వాత డీఎస్సీలో పాసై అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత టెట్ రాయమనడం అనేది సరైన విధానం కాదని, దాని నుండి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని . విద్యారంగ సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను  పక్క తోవ పట్టించడానికె ప్రభుత్వాలు టెట్ తీసుకొస్తున్నాయని. ప్రభుత్వాలు మారిన పాలకుల విధానాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని అనేక వ్యత్యాసాలతో పలు యాజమాన్యాలలో వివిధ పేర్లతో చలామణి అవుతున్నా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిని  ఒకే గొడుగు కిందికి చేర్చి కామన్ స్కూల్ విధానం, శాస్త్రీయ విద్యా విధానం కొరకు పోరాటం చేయవలసిన అవసరం ఉందని దుమాల రమానాధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐదు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి, పి ఆర్ సి ని వెంటనే  అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో పాత ప్రభుత్వాలు చేసిన విధ్వంసాలను సరి చేయవలసింది పోయి కొత్త ప్రభుత్వం మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చిపెడుతుంది. పాఠశాలల ను పర్యవేక్షణ చేయడానికి ఉపాధ్యాయ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారి పోయే ప్రమాదం ఉంది కావున వాటిని వెంటనే రద్దు చేయాలని, Kgbv పాఠశాల లకు care taker ను నియమించాలని, kgbv సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు, రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ commitee కన్వీనర్ బుస రాజేందర్,  TPTF మండల అధ్యక్షులు బండి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి దామెరశెట్టి మధుసూదన్, శ్రీనివాస్ రాజు, బొల్లి పర్షరాములు, పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >