| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పంచాయతీరాజ్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

పంచాయతీరాజ్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వివిధ శాఖల పనులపై సమీక్ష సమావేశం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పంచాయతీ రాజ్ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ భవనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టిన పనులపై వివిధ శాఖల, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలో 49 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా, పలు భవనాలు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను పూర్తి చేసి, పిల్లలను ఆకట్టుకునే రంగులు వేయాలని, నీటి వసతి మిషన్ భగీరథ ద్వారా కల్పించాలని ఆదేశించారు.

గ్రామ పంచాయతీ భవనాల పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. 

భవిత కేంద్రాల భవనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గడువు పెట్టి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

Previous స్నేహిత ద్వారా విద్యార్థులకు ధైర్యం, భరోసా కల్పించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Next 42 శాతం రిజర్వేషన్ల అమల్లో జరుగుచున్న జాప్యాన్ని నిరసిస్తూ, రాజ్యాంగ నిర్మాత డా!! బీఅర్. అంబేడ్గర్ విగ్రహానికి బీసీ నేతలు వినతి పత్రం సమర్పణ
ADVERTISEMENT