Posted on 2025-11-06 20:12:57
బీసీ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు!జనాభా దామాషాన బీసీ హక్కులు,ఆత్మగౌరవం,వాటా, కోటా సాధనకై చేస్తున్న పోరాటం!!
కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా, చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, రాజ్యాంగ బద్దంగా బీసీలకు 42 శాతంతో ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి!
డైలీ భారత్, సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసిన జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ,ఎన్నికల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని,రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించగా , హైకోర్టు జీవో 9 చెల్లదని,జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ మరియు ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం,మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా,పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపాలని,ఎన్నికలు జరుపుటకు తేదీలను ప్రకటించాలని కోరుతూ కోర్టు ప్రభుత్వాన్ని కోరుతూ,మళ్ళీ విచారణ ఈ నెల 24 కు వాయిదా వేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తో పాటుగా బీసీ జేఏసీ నేతలు కాడార్ల రాములు, ఇల్లందుల వెంకటేష్,పిన్నింటి హన్మాండ్లు తదితరులు తెలియజేశారు.
కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ,చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్దంగా,శాస్త్రీయంగా,పారదర్శకంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ,స్థానిక ఎన్నికలు జరపాలని, అంతవరకు ఎన్నికలు జరుపక కోర్టులతో న్యాయపోరాటం, కేంద్రంలో రాజకీయ పోరాటం చేయాలని ,పాత రిజర్వేషన్లతో,పార్టీ పర రిజర్వేషన్లతో ఎన్నికలు జరపవద్దని ప్రభుత్వానికి బీసీ జేఏసీ నేతలు పొలాస నరేందర్, కడారి రాములు, ఇల్లందుల వెంకటేష్, పిన్నింటి హన్మాండ్లు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి,వారి ప్రసంగాల్లో విజ్ఞప్తి చేశారు.
బీసీలు చేస్తున్న ఈ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని,జనాభా దామాషా ప్రకారం బీసీలకు మంత్రి వర్గంలో,ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో,రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి, ఉద్యోగ, ప్రమోషన్ల పరంగా రావాల్సిన కోటాకై,బీసీ సంక్షేమముకై రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన వాటాకై,పలు హక్కుల సాధనకై ,ఆత్మగౌరవంకై చేస్తున్న పోరాటమని ,ఈ పోరాటానికి అన్ని వర్గాలవారు,అన్ని మతాలవారు,రాజకీయాలకు అతీతంగా నేతలు, అఖిలపక్ష పార్టీలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు,కోర్టులు మద్దతు తెలపాలని బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >