| Daily భారత్
Logo




కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్

News

Posted on 2025-11-06 14:09:05

Share: Share


కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్

మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తాను ఐఏఎస్‌ను అంటూ ఓ మహిళ కామారెడ్డి కలెక్టర్ లోసృష్టించింది హల్చల్ సృష్టించింది. ఇంచార్జి కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో మహిళ హంగామా చేసిన ఘటన కామారెడ్డి కలెక్టరేట్లో కలకలం రేపింది. తనకు ఉద్యోగం వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫల ప్రయత్నం చేసిందని పోలీసులు నిర్ధారించారు.  కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2వ తేది నుండి సెలవులో ఉండగా, ఇంచార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్‌ వినయ్ కృష్ణారెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంతలోనే  ఈ నెల 4వ తేదీన కామారెడ్డి కలెక్టరేట్‌కు కారులో వచ్చిన నకిలీ కలెక్టర్ ఇస్రాత్ జహాన్ కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి, తనను ఇంచార్జి కలెక్టర్‌గా నియమించారని ఉత్తర్వులు నకిలీ ఉత్తర్వులు చూపించింది. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ

ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని, పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని మహిళకు అదనపు కలెక్టర్ వివరించారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో, అనుమానంతో కామారెడ్డి  పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు

సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించగా, 2020 నుండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారించారు. దీంతో మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసిన ఆమెను పోలీసులు వదిలివేశారు.

Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >