| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నాo పై సమగ్ర విచారణ జరిపించండి

ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నాo పై సమగ్ర విచారణ జరిపించండి

ఎక్సైజ్ కానిస్టేబుల్ అఖిలను వేధింపులకు గురిచేసిన ఎక్సైజ్ సీఐ పై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయండి,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ జానయ్యకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి,

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ అఖిల మత్తు మాత్రలు మింగి ఆత్మ హత్యాయత్నం పాల్పడిన సంఘటనపై  స్పందించిన ఎక్సైజ్ సెంట్రల్ యూనియన్ నాయకులు వెంటనే స్పందించి హుటా హుటిన  హైదరాబాదు నుండి కొత్తగూడెం చేరుకొని  స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో బాధితురాలు అఖిలను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  అనంతరం బాధితురాలు స్వయంగా జరిగిన సంఘటనలు గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నా రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి మరియు నాయకులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో   ప్రొబిక్షనరీ- ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ జానయ్య కు వినతిపత్రం సమర్పించి బాధితురాలకు న్యాయం చేకూర్చాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు . ఈ సందర్భంగా  వినతిపత్రం స్వీకరించిన సూపర్డెంట్ జానయ్య మాట్లాడుతూ బాధితురాలకు  జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి  చర్యలు తీసుకుంటామని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తప్పవని  ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా కిందిస్థాయి ఉద్యోగులకు ఏలాంటి సమస్యలు ఉన్న ఉన్నత అధికారులకు తెలియపరచాలని సూచించారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ఎక్సైజ్ యూనియన్ నాయకులు, జిల్లా లోని ఎక్సైజ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ తదితరులు ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్స్ పాల్గొన్నారు,

Previous జిల్లా విద్యాశాఖ అధికారి, రూరల్ ఎమ్మెల్యే పిఎ శ్రీనివాస్ రెడ్డికి హ్యూమన్ రైట్ కోర్ట్ నోటీసులు జారీ
Next కామారెడ్డి కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్ హల్చల్
ADVERTISEMENT