| Daily భారత్
Logo




రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

News

Posted on 2026-05-25 11:40:05

Share: Share


రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

కామారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ,కామారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి సమావేశం నిర్వహించారు ఆ సమావేశం వెనుక అంతర్యం ఏమిటి.

ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి రివ్యూ మీటింగ్ పెడితే బాగుంటుండే.

మున్సిపాలిటీ పరిధిలో ఒక ఆరు ఎకరాల ఒక వెంచర్ కు ఛార్జీ తీసుకున్న 3 రోజులకే కమిషనర్ అనుమతులు ఇచ్చారు. అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది.

నిజామాబాద్ వ్యక్తులకు చెందిన వ్యక్తుల వెంచర్ కు వుటావుటిన అనుమతులు ఇప్పించి వారితో స్వలాభం పొంది ప్రభుత్వ స్కూళ్లకు బెంచీలు పంపిణీ చేశారు.

గత వర్షాకాలంలో భారీ వర్షాలకు కూల్చిన రోడ్డు డివైడర్ లను తిరిగి నిర్మించే పనులు ఎమ్మెల్యే చేయడం లేదు.

హిందూ స్మశానవాటిక నిర్మాణానికి అన్ని సంఘాల వారితో మాట్లాడి అభివృద్ధికి నేను కృషి చేస్తుంటే కొంత మంది ఈ మంచి పనికి కొందరు కలిసి రావడం లేదు.

ఎవరైతే హిందువుల ఓట్లతో  గెలిచినారో వారే ఈ హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి కలిసి నడవడం లేదు.

కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ సలహాదారుగా, ఎమ్మెల్యేగా ఉన్నవారు హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

పది రోజుల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని కోరబోతున్న అందుకు మిగతా నాయకులు కలిసి రావాలి, లేదంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.

పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ కట్టడాలను అడ్డుకునే స్థితిలో కామారెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు లేరు.

వారం రోజుల్లో పట్టణంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చకపోతే ఆ కట్టడాల వద్దనే మీడియా సమావేశం పెట్టాల్సి వస్తది.

ఎన్నికల సమయంలో తప్ప గ్రామాలవైపు ఎమ్మెల్యే వెళ్లిన దాఖలాలు లేవు.

ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి  పిడుగు మమత సాయిబాబు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్ లావణ్య, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్,మాజీ కౌన్సిలర్లు, సలీం,చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు, నర్సుల మహేష్, బల్ల శ్రీనివాస్, మెహర్ బాబా గౌడ్, అరుణ్, రాహుల్, శశి, ఆకాష్. ఉన్నారు

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >