Posted on 2026-05-25 07:13:55
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి.
ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలని, అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, గోదాంలలో నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితులు, ధాన్యం నిల్వ సామర్థ్యం పూర్తి అయిన గోదాముల వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేయాలని, నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మిల్లులకు టార్గెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రైస్ మిల్లులు, గోదాంలు, అపెరల్ పార్క్ లో హమాలీల సంఖ్యను పెంచి, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. తుది దశలో ఉన్న కేంద్రాల్లో కొనుగోళ్లు మరింత వేగవంతం చేసి.. పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, కేంద్రాల వారీగా ఎన్ని గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయో ముందే తెలుసుకుని, సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు సరిపడా వాహనాలను సమకూర్చాలని, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ఈ దిశగా వాహనాలు సమకూర్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >