| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా విద్యాశాఖ అధికారి, రూరల్ ఎమ్మెల్యే పిఎ శ్రీనివాస్ రెడ్డికి హ్యూమన్ రైట్ కోర్ట్ నోటీసులు జారీ

జిల్లా విద్యాశాఖ అధికారి, రూరల్ ఎమ్మెల్యే పిఎ శ్రీనివాస్ రెడ్డికి హ్యూమన్ రైట్ కోర్ట్ నోటీసులు జారీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు పీఏగా కొనసాగుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్​రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారికి హ్యూమన్ రైట్స్ కోర్టు  నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పీఏగా విధులు నిర్వహించడం పట్ల మోపాల్ మండలం సిర్​పూర్​కు చెందిన గోపాల్ ఇప్పటికే అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రెండేళ్లుగా పీఏగా విధులు నిర్వహిస్తున్నారంటూ ప్రజావాణితో పాటు డీఈవోకు పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల హ్యూమన్ రైట్స్ కోర్టుకు ఫిర్యాదు వెళ్లగా.. తాజాగా నోటీసులు జారీ చేశారు. నవంబర్ 25వ తేదీ లోపు డీఈవో, ధర్పల్లి ఎంఈవో, ఉపాధ్యాయుడు శ్రీనివాస్​రెడ్డి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.

Previous లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు
Next ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నాo పై సమగ్ర విచారణ జరిపించండి
ADVERTISEMENT