| Daily భారత్
Logo




లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు

News

Posted on 2025-11-05 20:02:44

Share: Share


లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు

ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తికి ప్రతీక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శ్రీమన్నింబాచల క్షేత్రం బుధవారం జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో లింబాద్రి గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది.

పవిత్ర లింబాద్రి గుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  మాట్లాడుతూ..కార్తీకమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు అని అన్నారు.

లింబాద్రి గుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  హాజరై స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భక్తులు బిజెపి సీనియర్ నాయకులు పెద్దల్లా గంగారెడ్డి, బిజెపి నాయకులు ఇల్లందుల ప్రభాకర్,  మఠం పవన్, పవన్ ముందడ, సుగంధం హరీష్, రేణికింది హరీష్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >