| Daily భారత్
Logo




పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్

News

Posted on 2025-10-29 11:02:35

Share: Share


పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిఖిరం కార్యాక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహించగా ముఖ్య అతిధులుగా  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమ వంతు సహయముగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడినవారు అవుతారని తెలియజేశారు. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం  ఎందరికో  కొత్తజీవం అందించిన వారు అవుతారు అని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్త దానo చేసిన వారికి పోలీస్ కమిషనర్  హెల్మెట్ లు ప్రదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ్ చందర్, నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి. మస్తాన్ అలి, పోలీస్ యునిట్ ఆఫీసర్ డా॥ సరళ, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సి.ఐలు, ఎస్.ఐలు, మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది, పోలీస్ యునిట్ హాస్పటల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు రక్తదానం చేసిన ప్రజలు హాజరయ్యారు.

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >