Posted on 2024-01-07 18:45:57
డీజిల్ లేదని డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం
డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ప్రజలు ఆఖరు ఘట్టానికి అవస్థలు పడుతున్నారు. దానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పనితీరు మరింత తోడవుతుంది. వార్డుకు చెందిన ఒక వ్యక్తి గుండె నొప్పితో మరణించాడు. అయితే వార్డులో స్మశాన వాటిక లేదు. మృత దేహాన్ని మూడు కిలో మీటర్లకు పైగా వెళ్లి ఖననం చేయాలి. ఒంటి గంటకు స్థానికులు వైకుంఠ రథాన్ని పంపాలని సంబధిత మున్సిపల్ అధికారులకు తెలిపారు. సంబంధిత అధికారి డ్రైవర్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల వరకు వేచి చూసిన స్థానికులు డ్రైవర్ కు ఫోన్ చేయగా డీజిల్ లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక మృత దేహాన్ని మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు చేశారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి స్మశాన వాటిక నిర్మించాలని ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే స్మశాన వాటిక మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ కోరారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >