| Daily భారత్
Logo




రాష్ట్ర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

News

Posted on 2025-10-19 13:30:08

Share: Share


రాష్ట్ర ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

*Press Release*



డైలీ భారత్, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఆశ, అభివృద్ధి, సంక్షేమం కూడా తీసుకురావాలి. మన రాష్ట్రం మరోసారి వెలుగులా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

సీఎం చంద్రబాబు నాయుడు చూపుతున్న నాయకత్వం వల్ల రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. సాంకేతికత, విద్య, వ్యవసాయం, పరిశ్రమ, ప్రతి రంగంలో ఆవిష్కరణలతో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు లభిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసం కూటమి ప్రభుత్వానికి బలమని, ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగేలా ఆర్థికాభివృద్ధి, అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >