Posted on 2025-10-19 13:20:57
పది రోజులుగా ఆర్థోపెడిక్ రోగులకు అందని సేవలు
ఇబ్బందుల్లో రోగుల బంధువులు .. సేవలు కోసం రోజులకొద్దీ నిరీక్షణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోజుకు వేలాదిమంది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో సరైన పరికరాలు పనిచేయక రోగుల కు ఇబ్బందులు తప్పడం లేదు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఈ సమస్యను దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ, ఇది మా చేతిలో పని కాదు, అది అంతా ప్రభుత్వం చూసుకోవాల్సింది అంటూ చెబుతున్నారు తప్ప కాళ్లు, చేతులు విరిగిన వారికి వారముల కొద్దీ ఆపరేషన్లు చేయకుండా మంచానికే పరిమితం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం చెందిన పి. సాయిలు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడి కాలు, చెయ్యి విరిగిపోయింది. సాయిలు ఈనెల 6న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. సాయిలు కు మొదటగా రక్తం తక్కువ ఉందని రక్తం ఎక్కించాలని రోగి బంధువులకు చెప్పడంతో, వారు బయట మార్కెట్ నుంచి 1500 రూపాయలు పెట్టి రక్తం తీసుకువచ్చారు. ఆ తర్వాత సియాన్ మిషిన్ చెడిపోయింది, దీనివల్ల ఆపరేషన్ చేయడం కుదరదు అంటూ ఆ రోగిని బెడికే పరిమితం చేశారు. ఆరవ తేదీ నాడు ఆసుపత్రిలో చేరితే 12 రోజులుగా ఆ రోగికి ఆపరేషన్ చేయకుండా బెడ్కే పరిమితం చేశారు. రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రోజు ఆ రోగికి రక్తం లేదు అని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పిన విధంగా వారు ప్రైవేట్ నుంచి రక్తం తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రోజు ఆ రోగికి రక్తం లేదు అని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పిన విధంగా వారు ప్రైవేట్ నుంచి రక్తం తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆపరేషన్ చేసే మిషన్ పాడైంది టెక్నీషియన్ వచ్చేవరకు ఆపరేషన్ కాదు అంటూ కరాకండిగా వైద్యులు వెల్లడిస్తున్నారు. అత్యవసరమైన ఈ కేసులను తొందరగా ఆపరేషన్ చేసి వారికి సేవలు అందించే సియన్ మిషిన్ చెడిపోతే ఈ యంత్రాన్ని 24 గంటల్లో బాగు చేయించవలసి ఉండగా వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కింది సిబ్బంది అధికారి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారులకు తాము ఏమి చేయలేము, ఇదంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు టెక్నీషియన్ పంపిస్తే అప్పుడు మిషన్ బాగుపడుతుంది. అప్పుడు ఆపరేషన్లు చేస్తాం అని వైద్యుడు చెప్పుకోవస్తున్నారు. ఇలా రోజులకొద్దీ మిషన్ బాగు చేయలేక కాళ్లు, చేతులు విరిగిన రోగులు మంచం పట్టుకుని వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మాత్రం టెక్నీషియన్ వచ్చేవరకు తాము ఏమి చెప్పలేమని తెలుపుతున్నారు. ప్రతిరోజు వేలాదిమంది కి వైద్యం అందించే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఇంత నిర్లక్ష్యం ఉండడం రోగులకు శాపంగా మారింది. జిల్లాకే పెద్ద ఆసుపత్రి అయినా ఈ ఆసుపత్రిలో మిషన్ చెడిపోతే 24 గంటల్లో బాగు చేయించాల్సిన రాష్ట్ర ఉన్నత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జిల్లాకే పెద్ద ఆసుపత్రి అయినా ఈ ఆసుపత్రిలో మిషన్ చెడిపోతే 24 గంటల్లో బాగు చేయించాల్సిన రాష్ట్ర ఉన్నత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనివల్ల రోగులు రోజులకొద్దీ ఆసుపత్రిలో చికిత్స కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మన పాలకులు, అధికారులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికైనా పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి పై పాలకులు, ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిస్థితి పరిష్కారం చేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >