ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆహ్వానించిన వేద పండితులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ శృంగేరి శంకర మఠం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ జగద్గురు విధుశేఖర భారతి శ్రీ సన్నిధానం అమృత హాస్టల్ లతో శ్రీ లలిత చంద్రమౌళిశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువ గా కొనసాగింది. జగద్గురువుల అమృత హస్తాలచే శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందు ఆలయాలు హిందూ దేవతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూవు పై ఉందని బాసర లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం అందులో తాను పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారు. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరిగితే పేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.