Posted on 2025-10-16 18:45:03
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల 29 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు. మునిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2400గా నిర్ణయించిందని, ఈ కేంద్రాల ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా శక్తి క్యాంటీన్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా ఉంటోందని చెప్పారు. బీసీ 42 శాతం రిజర్వేషన్‌కు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని, శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కు, కేంద్రానికి పంపిన బిల్లు బిజెపి, బిఆర్ఎస్ ఎంపీలు అడ్డుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కొనసాగించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల కలలు నిజమవుతున్నాయని చెప్పారు. మన నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మునిపల్లి గ్రామంలో మహిళా భవన్,లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, యూత్ నాయకుడు వినోద్, తహసీల్దార్ కిరణ్మయి, సంఘ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >