Posted on 2025-10-14 18:59:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అన్ని దానాలు కన్నా అన్నదానం ఎంతో గొప్పదని సుంకోజు రాములు పేర్కొన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డు లో గల భాగ్యలక్ష్మి ఎల్పిజి గ్యాస్ బంక్ వద్ద సుంకోజు భాగ్యలక్ష్మి శ్రీరాములు, సుంకోజు సంతోష్ కుమార్, మంగ, భాగ్యలక్ష్మి, సాత్విక, మల్లికార్జున్ వారి ఆధ్వర్యంలో గత శుక్రవారం నుండి అనాధ నిరశ్రాయులకు, నిరుపేదల కోసం ప్రతిరోజు ఉచితంగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం బంకు ఆవరణలోనే నిర్వహించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. కులమతాలకతీతంగా ఎవరైనా ఆకలితో ఉన్నవారు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సంకల్పించినట్లు ఆయన వివరించారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి నిరుపేదల వద్ద నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గతంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద తాను పేదవారికి ఇదే అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి తన సేవలు మార్చడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఇది ఇలా ఉండగా అన్నదాన కార్యక్రమం ఇప్పటివరకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు చూసాము వచ్చినవారు తిని వెళ్తుంటారు, కానీ ఈయన నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మాత్రం ఈ నా దగ్గరికి వచ్చే నిరుపేదలకు కనీసం ప్లేట్లు కడగలేని నిరుపేదలు, వృద్ధులు అన్నదాన కార్యక్రమానికి వచ్చి ప్లేట్లు అలాగే వదిలేసి వెళ్లడంతో స్వయంగా ఆయనే ప్లేట్లు కలిగి వచ్చిన వారికి ఆహారం అందించిన గొప్ప మానవతావాది అయిన అని చెప్పనక్కర్లేదు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >