| Daily భారత్
Logo




ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త మైలురాయి... విశాఖపట్నంలో గూగుల్ AI హబ్..

News

Posted on 2025-10-14 18:06:41

Share: Share


ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త మైలురాయి... విశాఖపట్నంలో గూగుల్ AI హబ్..

డైలీ భారత్, విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.

గూగుల్ 10 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250 కోట్లు)తో విశాఖలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్‌ కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లాభం, 1.88 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి అదనంగా సుమారు రూ.9,553 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం AI సిటీగా రూపాంతరం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు AI నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయన్నారు. ప్రపంచ దృష్టి ఆంధ్రప్రదేశ్‌ పై ఉండేలా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ AI, టెక్ హబ్‌గా నిలబెడుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >