Posted on 2025-10-14 16:56:32
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు లంచం కోరినట్లు తెలుస్తోంది.
దీంతో బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా సర్వేయర్‌కి రూ.10 వేలు అప్పజెప్పగా, తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మిగతా రూ.20 వేలు అందజేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు సిరిసిల్ల ఎమ్మార్వో కార్యాలయంలో మాటు వేశారు. బాధితుడు చేతిలోని రూ.20 వేల లంచం తీసుకుంటున్న వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనతో జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో తక్కువ సమయంలో జరిగిన రెండో సర్వేయర్ అరెస్ట్ కావడం గమనార్హం. గత మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ లంచం కేసులో పట్టుబడగా, ఇప్పుడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ట్రాప్‌లో చిక్కుకోవడంతో జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >