| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాణాసంచా విక్రయానికి అనుమతులు తప్పనిసరి : ఎస్పి నరసింహ ఐపిఎస్, సూర్యాపేట జిల్లా

బాణాసంచా విక్రయానికి అనుమతులు తప్పనిసరి : ఎస్పి నరసింహ ఐపిఎస్, సూర్యాపేట జిల్లా

దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయానికి అనుమతులు తప్పనిసరి

ప్రజల భద్రత పోలీసు ముఖ్య విధి

ఎస్పి నరసింహ ఐపిఎస్, సూర్యాపేట జిల్లా

డైలీ భారత్, సూర్యాపేట:దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా (పటాకులు) విక్రయానికి సంబంధించిన అధికారుల నుండి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే క్రాకర్స్ విక్రయం జరగాలి. అనుమతి లేకుండా ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం నిషిద్ధం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర సంఘటనలను నివారించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు. బాణాసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపవద్దు అని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను పెట్టినట్లైతే వారిపై ఎక్స్-ప్లోజివ్ యాక్టు ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొనబడును.

క్రాకర్స్ విక్రయదారులకు సూచనలు:

1. సంబంధిత అధికారుల నుండి ముందుగా అనుమతి పొందాలి.

2. కేవలం గుర్తించిన ప్రదేశాల్లోనే విక్రయం చేయాలి.

3. భద్రతా ప్రమాణాలు పాటించాలి.

4. క్యూ పద్ధతి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

5. నిభందనలు మించి ఎక్కవ ధరలకు అమ్మవద్దు.

6. టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. 

7. జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. 

8. దుకాణాల మధ్య కనీస దూరం పాటించాలి.

9. అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలి.

10. విద్యుత్ లైన్ల దగ్గర బాణాసంచా నిల్వ చేయరాదు.

11. మైనర్లు (చిన్నపిల్లలు) విక్రయంలో పాల్గొనరాదు.

జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి ప్రమాదాలకు దూరంగా ఉంటూ ఉత్సవాలు సురక్షితంగా, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

Previous మగవారిని ఆకర్షించేలా అందాలను చూపిస్తూ న్యూసెన్స్ సృష్టించిన ఆరుగురు మహిళలకు జైలు శిక్ష
Next మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ
ADVERTISEMENT