Posted on 2025-10-13 20:09:31
డైలీ భారత్, నిజామాబాద్:మగవారిని ఆకర్షించేలా తమ అందాలను చూపిస్తూ వారిని వల్లో వేసుకోవడానికి ప్రేరేపిస్తూ న్యూసెన్సు క్రియేట్ చేసిన ఆరుగురు మహిళకు జైలు శిక్ష ఖరారైందని నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ లో వివరాలు వెల్లడించారు. ఈనెల 11 న రాత్రి 8 గంటలకు నగరంలోని బస్టాండు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కామారెడ్డి, భైంసా ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలు మగవారిని ఆకర్షించేందుకు తమ అవయవాలను చూపిస్తూ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్సు క్రియేట్ చేస్తుండటంతో వారి పై 68 సిటీ పోలీస్ యాక్టు సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ రఘుపతి వివరించారు.
సోమవారం ఆరుగురు మహిళలను స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచారు. నిందితుల్లో ఒకరికి ఒకరోజు, మిగతా ఐదుగురు నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడమైందని ఎస్హెచ్ఓ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలుకు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే వారి పై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని రఘుపతి హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >