| Daily భారత్
Logo




అయినవారు అంగ వైకల్యాన్ని చూసి వెలివేశారు... అంగవైకల్యాన్ని చూసైనా పింఛన్ ఇప్పించండి సారు...

News

Posted on 2025-10-13 17:38:25

Share: Share


అయినవారు అంగ వైకల్యాన్ని చూసి వెలివేశారు... అంగవైకల్యాన్ని చూసైనా పింఛన్ ఇప్పించండి సారు...

అయినవారు, కట్టుకున్న భార్య తన అంగ వైకల్యాన్ని చూసి వెలివేశారు

తన అంగవైకల్యాన్ని చూసైనా పింఛన్ ఇప్పించండి సారు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో తన మోకాలికి తీవ్ర గాయమై మోకాలు చిప్ప అరిగిపోవడంతో కుటుంబ పోషణ సంపాదించడం లేదని తన కుటుంబ సభ్యులు, తన భార్యతో సహా తనను ఇంటి నుండి వెలివేసారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కు చెందిన భీమ్రావు చౌహాన్ అనే వ్యక్తి తనకు పింఛన్ వచ్చే అర్హత ఉన్న పలుమార్లు పింఛన్ ఇప్పించాలని కలెక్టరేట్ కు వచ్చి వినతి పత్రాలు సమర్పించిన తమకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వర్ని రోడ్డు లోని  సాయి నగర్ కాలనీకి చెందిన 58 సంవత్సరాల వయసుగల భీమ్రావు చౌహన్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల క్రితం  రోడ్డు ప్రమాదంలో మోకాలికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు మోకాలు చిప్ప కు వైద్యులు రాడ్డు వేశారు. అది కాస్త రాడ్డు అరిగిపోయి నడవలేని పరిస్థితిగా మారిందని, సంపాదన లేక తినడానికి తిండి లేక కష్టంగా ఇబ్బందిగా ఉందని ఆయన తన ఆవేదనను వెలగక్కారు. తన తన వైకల్యాన్ని చూసి తనకు పుట్టిన కన్న కొడుకులు బిడ్డలు, భార్య ఇంట్లో నుంచి వెలివేసారని సంపాదిస్తేనే ఇంట్లో ఉండాలని తనను ఇంట్లో నుండి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అంగవైకల్యాన్ని చూసి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తనకు వృద్ధాప్య పింఛన్ అయిన, వికలాంగ పించన్ అయినా ఇప్పించాలని ఆయన కోరారు. ఆయన పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో అదే కాలనీకి చెందిన టి యు సి ఐ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యవర్గ సభ్యులు సాయికుమార్ అతనిని సోమవారం ప్రజావాణికి తీసుకువచ్చి బాధితుని సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రజావాణిలో వినతి పత్రం అందించారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >