Posted on 2025-10-08 21:14:14
యదేచ్ఛగా చెట్లను నరుకుతున్న పట్టించుకోని అటవీశాఖ అధికారులు
తాజాగా 12 మంది పై నామమాత్రపు కేసులు.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీప దూరంలో గల లింగి తండా అడవులపై స్థానిక తండావాసులు పంజా విసురుతున్నారు. గత కొన్ని రోజులుగా యదేచ్చగా ఫారెస్ట్ కు సంబంధించిన ప్రాంతాలలో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. మొత్తం 70 ఎకరాలలో గత వారం రోజులుగా చెట్లను నరికేసి తమ అక్రమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు రావడంతో హడావిడిగా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ సిసి ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వారిపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. మిగిలిన 10 మందిపై అటవీ శాఖలో కేసు నమోదు అయింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే అటవీ సంపద దోపిడికి గురవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్మగ్లర్ల అక్రమ చెట్ల నరికివేత మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారుల అండదండలతోనే అటవీ సంపద దోపిడికి గురవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు కొలువుదీరిన జిల్లా కేంద్రానికి సమీప దూరంలోనే అడవులు అన్యక్రాంతమవుతున్న పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ప్రభుత్వాలు అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆలోచనకు గండి పడుతుంది. హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుండగా, అలాంటి చెట్లనే నరికి వేసిన ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. లింగి తండా అటవీ ప్రాంతంలో స్థానిక తండావాసులు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీ శాఖ అధికారులు తూతూ మంత్రంగా 12 మంది పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. వారిలో ఇద్దరిని గుర్తించి వారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మరో పదిమంది పై అటవీ శాఖలో కేసు నమోదు చేసిన ఆ పదిమందిని ఇంతవరకు గుర్తించకపోవడం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా అటవీ శాఖకు సంబంధించిన 70 ఎకరాలలో చెట్లను నరుకుతున్న స్పందించకపోవడం స్థానిక తండావాసులుతో కొందరి అటవీశాఖ అధికారులకు పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అంతరించిపోతున్న అటవీ సంపదను పరిరక్షించి, స్థానికుల ఆట కట్టించాలని పలువురు కోరుతున్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >