| Daily భారత్
Logo




అధికార పార్టీలో జడ్పీ పీఠం దక్కించుకునేది ఎవరు..?

News

Posted on 2025-10-08 20:08:09

Share: Share


అధికార పార్టీలో జడ్పీ పీఠం దక్కించుకునేది ఎవరు..?

తెరమీదికి రాబోతున్న ఈరవత్రి అనిల్ సతీమణి సుహాసిని..

మరి సీనియర్ మహిళా బీసీ నేత ఆకుల లలిత పరిస్థితి ఏంటి..?

జిల్లాలో హాట్ టాపిక్ గా  మారిన జడ్పీ చైర్మన్ పీఠం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రమైంది. అయితే, పదవి ఆశించి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని కాదని, కష్టకాలంలో జెండా మోసిన వారికే అధిష్టానం పట్టం కట్టాలని నిర్ణయిం చుకున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ జరు గుతుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి, సదువుల కోసం వేరే పార్టీలో చేది. ఇప్ప మళ్లీ కాంగ్రెస్ అధికారంలో కి రాగానే తిరిగొచ్చిన వారికి జడ్బీ చైర్మన్ సీటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలుస్పష్టం చేస్తున్నాయి. పార్టీలోకి చేరేముందే, పదవులు ఆశించకుండా వస్తేనే రండి అని కాంగ్రెస్ పెద్దలు గతంలోనే తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ చర్చకు ప్రధాన కారణం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గతంలో కాం గ్రెస్లో ఉన్నప్పుడు ఆర్మూర్ టికెట్ ఇవ్వగా, ఆమె ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేసి, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి సహకరిస్తూ సరెండర్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఆమె ఆ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగి యగానే, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో, ఆమె ఆ పదవికి రాజీనామా చేసి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కష్టకాలంలో పార్టీని వీడిన వారికి జడ్పీ  చైర్మన్ పదవి దక్కే అవకాశం లేదనే చర్చ మొదలైంది. అయితే, జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రస్తుత మినరల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఈరవత్రి అనిల్ సతీమణి  సుహాసిని వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాచనతో అనిల్ తన స్థానాన్ని బాల్కొండ అభ్యర్థి సునీల్ రెడ్డికి త్యాగం చేశారు. ఈరవత్రి అనిల్ పార్టీలో సీనియర్ నేతగా ఉండటం, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడటం, నేతలందరి మద్దతు. ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండటం వంటి అంశాలు మహాసినికి కలిసి వస్తున్నాయట. సుహాసిని మెండోర నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ, అనిల్ భార్య సుహాసినికే జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జోరందుకుంది.

Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >