| Daily భారత్
Logo




స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి : రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

News

Posted on 2025-10-08 18:07:04

Share: Share


స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి : రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

పాల్వంచ మండలంలో కొత్వాల పర్యటన

డైలీ భారత్, పాల్వంచ: త్వరలో స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు తమ సత్తా చాటి పార్టీ అభ్యర్థుల విజయానికి కంకణ బద్దులు కావాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మండలం పరిధిలోని దంతేలబోర, ఎస్సీ కాలనీ,బండ్రుగొండ, గ్రామాలలో కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానికంగా కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి జడ్పిటిసి,ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పిటిసి ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకి రెడ్డి, పెద్దమ్మతల్లి దేవాలయం చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,కాంగ్రెస్ నాయకులు ధర్మసోత్ ఉపేందర్ నాయక్,జమ్ముల రాజశేఖర్,మాజీ ఎంపీపీ కాక శ్రీనివాసరావు,దంతెల బోర మాజీ సర్పంచ్ బెల్లం అలివేలు, నాయకులు బోధ శ్రీలత రెడ్డి,గోసుల సతీష్, కొర్రయ్య,తెల్లం మల్లేష్,పోలేబోయిన వెంకటేశ్వర్లు, కంటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >