Posted on 2025-10-04 20:55:35
డైలీ భారత్, న్యూ ఢిల్లీ:తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని,ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది.మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది.ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వైపు హైకోర్టులో మరో వైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.దీంతో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో హైకోర్టు,సుప్రింకోర్టులు ఏం చెప్పబోతున్నాయి?జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది.ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో ఉండగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‍తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >